గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 3 జులై 2019 (18:14 IST)

రాజు గారి గ‌ది 3 నుంచి త‌మ‌న్నా త‌ప్పుకుందా..? ఓంకార్ మాట్లాడితేనే...

రాజు గారి గ‌ది... ఈ సినిమా చిన్ని సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో.. ఆ త‌ర్వాత నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజు గారి గ‌ది 2 కూడా తీయ‌డం తెలిసిందే. ఇప్పుడు రాజు గారి గ‌ది 3 సినిమాను ఓంకార్ ఇటీవ‌ల ప్రారంభించారు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుంది. ఫిల్మ్ న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో జ‌రిగిన ఈ మూవీ ప్రారంభోత్స‌వంలో త‌మ‌న్నా కూడా పాల్గొంది.
 
త్వ‌ర‌లో ప్రారంభం కానున్న షూటింగ్‌లో.. త‌మ‌న్నా జాయిన్ అవుతుంది అనుకుంటున్న త‌రుణంలో త‌మ‌న్నా ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది అని వార్త‌లు రావ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసాయి. మ్యాట‌ర్ ఏమై ఉంటుంది అని ఆరా తీస్తే... త‌న‌కి చెప్ప‌కుండా క‌థ‌లో.. త‌న పాత్ర‌లో మార్పులు చేసార‌ని.. దీంతో త‌మ‌న్నా బాగా ఫీలై ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ని కొంతమంది చెబుతున్నారు.
 
ఐతే హిందీ సినిమాలో ఛాన్స్ రావడం వలన తప్పుకుందని మ‌రికొంత మంది చెబుతున్నారు. ఈ నేప‌ధ్యంలో తాప్సీతో ఓంకార్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని.. ఆమె ఓకే అంటే త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని చెబుతున్నారు. ఇది నిజ‌మో కాదో ఓంకారే చెప్పాలి.