సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 3 జులై 2019 (17:24 IST)

అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళుతుందా..? లేదా..?

అక్కినేని అఖిల్ న‌టించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో నాలుగ‌వ సినిమా అయినా విజ‌యాన్ని అందిస్తుందా లేదా అని అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తుంటే... ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల ఈ సినిమాని ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

ఈ చిత్రానికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పైన బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెల‌లో ఈ సినిమాని ప్రారంభించారు కానీ... ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్ పైకి వెళ్లలేదు. 
 
జూన్ నెలలో సెట్స్ పైకి వెళుతుంది అన్నారు ఆ త‌ర్వాత  జూన్ 26 నుంచి సెట్స్ పైకి వెళుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ... ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ సెట్ అయ్యారట కానీ.. హీరోయిన్ ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా క‌న్ ఫ‌ర్మ్ కాలేద‌ట‌. అందుక‌నే ఆల‌స్యం అవుతుంద‌ని స‌మాచారం. 
 
తాజా వార్త ఏంటంటే... హీరోయిన్ ఎవ‌రు అనేది ఖ‌రారు చేసే ప‌నిలో ఉన్నార‌ట చిత్ర యూనిట్. కైరా అద్వానీ, ర‌ష్మిక పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ... కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే హీరోయిన్‌ని ఎంపిక చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నార‌ట. ఈ నెల 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసారని తెలిసింది. ఈ డేట్ అయినా నిజ‌మో కాదో..?