శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (20:34 IST)

నాగార్జున బంగార్రాజు సినిమా అస‌లు ఉందా..? లేదా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున కొత్త సినిమా మ‌న్మ‌థుడు 2. చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా ఆగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయానా చిత్రానికి సీక్వెల్ బంగార్రాజు చేయ‌నున్న విష‌యం తెలిసిందే. 
 
ఈ సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ... అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ మాత్రం రావ‌డం లేదు. దీంతో క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తార‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జులైలో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందులో అనుష్క‌, సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. ఈ క్రేజీ మూవీలో నాగచైత‌న్య కూడా న‌టిస్తుండ‌డం విశేషం. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన నాగార్జున నిర్మించ‌నున్న ఈ సినిమాని త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే అక్కినేని అభిమానుల‌కు పండ‌గే..!