శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (09:55 IST)

కన్నకూతురిపై 600 సార్లు అత్యాచారం-626 కేసులు.. 12వేల ఏళ్ల కఠిన కారాగార శిక్ష?

కన్నకూతురిపై 600సార్లకు పైగా లైంగిక దాడికి పడిన కీచక తండ్రికి మలేషియా న్యాయస్థానం 12వేల సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. భార్యతో అభిప్రాయ భేదాల కార

కన్నకూతురిపై 600సార్లకు పైగా లైంగిక దాడికి పడిన కీచక తండ్రికి మలేషియా న్యాయస్థానం 12వేల సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. భార్యతో అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయిన భర్త తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి వుంటున్నాడు. 
 
ఈ క్రమంలో కన్నకూతురిపై కన్నేసిన ఆ కామాంధుడు ఆమెపై 600సార్లకు పైగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి అరాచకాలను భరించలేని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నారు. ఏకంగా అతనిపై 626 కేసులు నమోదు చేశారు. అతనిని జూలై 26 అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ కేసులు చదివేందుకు న్యాయస్థానానికి రెండు రోజులు పట్టింది. ఇప్పటికే వాదనలను పూర్తి కావడంతో తీర్పు పెండింగ్‌లో వుంది. భారీ కేసుల్లో ఇరుక్కుపోయిన అతనికి 12వేల సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షపడే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు.