శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (10:19 IST)

డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. దేశం వదిలిపోతా.. విమానాశ్రయం దారి వెతుక్కుని అటు నుంచి అటే..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ గెలుస్తాడేమోనన్న భయంతో భారత ప్రభుత్వం ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హయాం ముగిసిపోయేలోగా అగ్ర

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ గెలుస్తాడేమోనన్న భయంతో భారత ప్రభుత్వం ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హయాం ముగిసిపోయేలోగా అగ్రరాజ్యంతో అనుకున్న ఒప్పందాలన్నింటినీ పట్టాలెక్కించాలని భావిస్తోంది.

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ గెలవడం అమెరికన్లకే నచ్చట్లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. తాను అమెరికా వదిలి మళ్లీ తన స్వదేశమైన డెన్మార్క్ వెళ్లిపోతానని రాక్‌స్టార్ లార్స్ ఉల్రిచ్ అంటున్నాడు. టీనేజిలో ఉండగా అమెరికాకు వలస వెళ్లిన ఉల్రిచ్.. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. 
 
కానీ, అతడికి డేనిష్ పౌరసత్వం కూడా అలాగే ఉంది. అందువల్ల ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్వదేశానికి వెళ్లిపోయే అవకాశం ఉంది. తాను నూటికి నూరుశాతం డేనిష్ పౌరుడినేనని, ఉల్రిచ్ తాజాగా చెప్పాడు. తాను అమెరికాలో పన్నులు కడుతున్నాను గానీ, ఇక్కడ ఓటు మాత్రం వేయలేనన్నాడు. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిస్తే మాత్రం తాను మళ్లీ విమానాశ్రయం దారి వెతుక్కుని అటు నుంచి అటు తన దేశానికి వెళ్లిపోతానని స్పష్టం చేశాడు.