1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (14:11 IST)

మెక్సికోలో జైలుఖైదీల మధ్య ఘర్షణ: 52 మంది మృతి, 12 మందికి గాయాలు

ఉత్తర మెక్సికోలోని మాంటరే నగరంలో టోపోచికో జైలులో రెండు గ్రూపుల తాగాదాలు 52 మంది ప్రాణాలు తీసింది. రెండు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఓ వర్గంపై మరో వర్గం దాడి చేసుకోవడంతో వివాదం ముదిరింది. జైలు లోపలి భాగం పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్లో 52 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు. జైలులో వ్యాపించిన మంటల వల్ల కొందరు గాయపడ్డారు.
 
ఘర్షణ చోటు చేసుకున్న సమయంలో కొందరు ఖైదీలు జైలు లోపల నిప్పంటించడంతో మృతుల సంఖ్య పెరిగిందని జైలు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. జైలు నుంచి పొగలు రావడం, గందరగోళం మధ్య పలువురు ఖైదీలు పారిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. దీని సమీపంలోని ఓ జైలును పోప్‌ ప్రాన్సిస్కో సందర్శించాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.