బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (12:53 IST)

ఇమ్మిగ్రేషన్, గోడ నిర్మాణంపై వ్యతిరేకత.. మెక్సికో ఏకమైంది.. ట్రంప్ హిట్లర్ అంటూ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వ్యతిరేక స్వరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అమెరికా-మెక్సికోల మధ్య గోడను నిర్మిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో.. మెక్సికో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్త

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వ్యతిరేక స్వరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అమెరికా-మెక్సికోల మధ్య గోడను నిర్మిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో.. మెక్సికో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. రోడ్డెక్కారు. మెక్సికో అధ్యక్షుడు న్యూటో గోడ నిర్మాణానికి నిధులు చెల్లించేది లేదని తెగేసి చెప్పారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీకి, సరిహద్దులో గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా మెక్సికో ప్రజలు రోడ్డుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 
 
డజన్ల కొద్దీ పట్టణాల్లో ప్రజలు తెల్ల వస్త్రాల్లో వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాన్ని, ట్రంప్‌ వ్యతిరేక ప్లకార్డులను చేతబూని ఆందోళన చేపట్టారు. అలాగే ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తద్వారా మెక్సికో ఏకమైందనే సందేశాన్ని వారు పంపాలనుకుంటున్నట్లు ఆందోళనకారులు చెబుతున్నారు.  అమెరికా సమాజాన్ని వలసలతోనే నిర్మనించారని.. ఇకపైనా వలసలతోనే నిర్మిస్తారనే విషయాన్ని మెక్సికో ప్రజలు గుర్తు చేశారు. 
 
దేశంలో హింస, అవినీతిని అంతమొందించడంలో విఫలమైన మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్‌ పీనా న్యూటోను కూడా వారు నిందిస్తున్నారు. ప్రపంచానికి ట్రంప్‌ ఇమ్మగ్రేషన్‌ పాలసీలు ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.