శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (20:49 IST)

మియామీలో కుప్పకూలిన 12 అంతస్తుల భవనం.. 159 మంది శిథిలాల కింద..?

Miami
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీలో 12 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సోమవారం నాటికి మృతుల సంఖ్య 11కు చేరినట్లు మియామీ డెడ్ కౌంటీ మేయర్ డానీయెల్లా లెవైన్ కావా తెలిపారు. ఈ ఘటన సమయంలో మొత్తం 159 మంది శిథిలాల కింద చిక్కుకోగా, ఇప్పటివరకు 136 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు మేయర్ వెల్లడించారు. 
 
సుమారు 400 మంది రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు రెస్యూ సిబ్బంది పగలు, రాత్రి కష్టపడుతున్నారని ఫ్లోరిడా స్టేట్ ఫైర్ మార్షల్ జిమ్మీ పాట్రోనిస్ తెలిపారు. ఇక ఈ బహుళ అంతస్థుల భవనంలో అమెరికన్స్‌తో పాటు పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులా దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.