శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (16:56 IST)

మనిషి కూడా పాముల్లా విషాన్ని ఉత్పత్తి చేయగలడట.. అది కూడా లాలాజలంతో..?

మనిషి కూడా పాములాంటి విషాన్ని ఉత్పత్తి చేయగలడని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు. పిట్ వైపర్ పాము విషంతో సమానమైన ఒక జన్యువును మనిషిలో గుర్తించారు. జపాన్‌లోని ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు సరీసృపాలు, క్షీరదాల్లో మాత్రమే నోటిలో విషాన్ని తయారు చేసుకునే లక్షణం ఉంది. ఇటీవల జరిపిన పరిశోధనలో మనిషి పాముల వంటి విషాన్ని ఉత్పత్తి చేయగలడని తెలిసింది.
 
వాస్తవానికి ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ పరిశోధకులు తైవాన్ హబు పిట్ వైపర్‌పై అధ్యాయనం చేశారు. ఇందులో పాముల విషంలా మనిషి లాలాజలంలో ఉండే ఒక జన్యువును కనుగొన్నారు. క్షీరదాలు, సరీసృపాలు ఇప్పటికే నోటి ద్వారా విషాన్ని అభివృద్ధి చేయగలవు. మనుషులు కూడా విషాన్ని తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
 
దీని ప్రకారం మనుషులు కూడా సరీసృపాల వలే విషాన్ని ఉత్పత్తి చేయగలరని నిర్ధారించారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము రాటిల్ స్నేక్. అత్యంత విషపూరితమైన క్షీరదం డక్‌బిల్. వాటితో సమానమైన విషాన్ని మనిషి తన లాలాజలంతో తయారు చేసుకోగలడని శాస్త్రవేత్తలు వెల్లడించారు.