శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 12 మే 2018 (17:47 IST)

వామ్మో రాకాసి అల.. ఎనిమిదో అంతస్తు మేడను తాకింది..

న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో గల క్యాంప్‌బెల్ ద్వీప సమీపాన రాకాసి అలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది దక్షిణార్థగోళంలో భారీ ఎత్తైన అలను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు

న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో గల క్యాంప్‌బెల్ ద్వీప సమీపాన రాకాసి అలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది దక్షిణార్థగోళంలో భారీ ఎత్తైన అలను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 23.8 మీటర్ల ఎత్తున ఈ రాకాసి అల నౌకపై విరుచుకుపడినట్లు తెలుపబడినది. అల ఎత్తు ఎనిమిది అంతస్తుల మేడకు సమానంగా ఈ అల తాకిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
 
న్యూజిలాండ్‌లో ఇదే విధంగా 2012లో 22.03 మీటర్ల ఎత్తుగల భారీ అల ఏర్పడింది. అయితే వీటికంటే అతి భారీ అలలు సంభవించాయి. కానీ  ఇప్పటివరకూ భూమి మీద అతిపెద్ద అల అలస్కా తీరంలోని లితుయా అగాథం వద్ద సంభవించింది. 
 
1958లో సంభవించిన ఓ భారీ భూకంపం కారణంగా అగాథంలో అలలు 30.5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయని న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి ఎత్తైన అలలు ప్రతీ మూడు గంటలకు ఓసారి 20 నిమిషాలు ఉత్పన్నమవుతాయని.. రాకాసి అలల తీవ్రత భయానకంగా వుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.