1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 17 నవంబరు 2020 (10:36 IST)

మీరు సహకరించకుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోతారు: బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్ వచ్చే నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు వేచి ఉంటే కరోనా మహమ్మారిని అరికట్టే సమయం మించి పోతుంది. దీని వలన అనేక మంది కరోనా వైరస్ బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉందని, కాబట్టి తమ బృందానికి సహకరించాలని అధ్యక్షుడు ట్రంప్‌ను జో బైడెన్ కోరారు.
 
వ్యాక్సిన్ ప్రణాళిక, జాతీయ భద్రతా పరమైన అంశాలు, అధికార బదిలీ కోసం ఏర్పాటు చేసిన తన బృందంతో కలిసి సహకరించాలని, లేదంటే మరింత ప్రాణాలు కోల్పోయే అవకాశం వుందని జో బైడెన్ తెలిపారు. అదే తరుణంలో టీకా పంపిణీ అనేది ప్రస్తుతం కీలకమైన అంశాలతో కూడుకున్నది.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పొందినప్పటికీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, నిజానికి తానే గెలుపొంది ఉంటానని ట్రంప్ ప్రతిరోజు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ తొలిసారి ట్రంప్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.