న్యూడ్ రెస్టారెంట్ మూసివేత... ఎందుకంటే...?
మామూలుగా జరిగే వ్యాపారాలు సరే సరిగ్గా జరగడం లేదని మూసేస్తున్నారంటే సరే అనుకోవచ్చు కానీ ఆడ మగ తేడా లేకుండా బట్టలు విప్పేసి కూర్చొని తిని, త్రాగే సదుపాయాలని అందించే వింత రెస్టారెంట్లు కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుండి మూసివేస్తున్నారు. ఇటీవల కాలంలో దీనికి కూడా కస్టమర్లు బాగా తగ్గిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీని యజమానులు తెలియజేసారు.
అయితే, ఈ రెస్టారెంట్ గురించిన వివరాలలోకి వెళ్తే... ఇప్పటివరకు మనం బట్టలు విప్పేసి నగ్నంగా తిరిగే బీచ్‌లు గురించే విని ఉన్నాము కానీ, ఈ ‘న్యూడ్’ రెస్టారెంట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు చదివింది కరెక్టే. ఆ రెస్టారెంట్‌లో ఎవరికీ ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా ఉండకూడదు. అందరూ దుస్తులు విప్పేసి నగ్నంగా తిరిగాలి... తినాలి... తాగి ఎంజాయ్ చేయాలి. ఛీపాడు.. అదేం ఆనందం అనుకుంటున్నారా? ఆ రెస్టారెంట్ ప్రత్యేకతే అది!!
ఇంతకీ ఈ రెస్టారెంట్‌కు వెళ్లాంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో అడుగుపెట్టాల్సిందే. ప్రపంచంలోనే తొలి న్యూడ్ రెస్టారెంట్‌గా పేరొందిన ఓనేచురల్ రెస్టారెంట్‌లో అడుగుపెట్టగానే ఆడ, మగ తేడా లేకుండా అంతా బట్టలు వదిలేయాల్సిందే. కస్టమర్లు తమ దుస్తులు, ఇతరత్రా వస్తువులను పెట్టుకునేందుకు అక్కడ లాకర్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ రెస్టారెంట్‌లో పనిచేసే సర్వర్లు, చెఫ్‌లు ఇతరత్రా సిబ్బంది మాత్రమే దుస్తులు ధరిస్తారు. ఫొటోలు, వీడియోలకు అనుమతించరు.
నగ్నంగా ఎందుకు?: కవలలైన మైక్, స్టెఫానే సాద 2016లో ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. తమ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లు ఎలాంటి ‘దాపకరికాలు’ లేకుండా మనసు (బట్టలు) విప్పి ఆనందంగా, విభిన్నంగా గడపాలనే ఉద్దేశంతోనే ఈ న్యూడ్ రెస్టారెంట్‌ను ప్రారంభించామని వారు తెలిపారు. ఇలా దుస్తులు విప్పి గడపడం వల్ల శృంగారంపై మోజు, సాన్నిహిత్యం పెరుగుతుందన్నారు. ఎవరైనా చూడాలనుకుంటే ఈలోగా ఒకసారి వెళ్లొచ్చేయాల్సిందే మరి...