శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (08:30 IST)

బ్యాంకులకు తాళం.. ఐదు రోజులు సేవలు బంద్

దేశంలోని బ్యాంకులకు తాళం పడనుంది. ఫలితంగా ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈనెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగనున్నారు. ఈరోజుల్లోనే ప్రభుత్వ సెలవుదినాలు కలిసి రావడంతో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీ అంటే శుక్రవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఆతర్వాత 22వ తేదీ నాలుగో శనివారం, 23వ తేదీన ఆదివారం, 25వ తేదీన క్రిస్మస్, 26వ తేదీన బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునివ్వడం వంటి కారణాల రీత్యా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనుండటంతో ఏటీఎం కేంద్రాల్లో కూడా నగదు నిండుకునే అవకాశం ఉంది. దీనికితోడు క్రిస్మిస్, కొత్త సంవత్సర వేడుకలు రావడంతో కస్టమర్లంతా తమ అవసరాల కోసం భారీ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా నగదు కష్టాలు ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదు. సో.. ముందే త్వరపడి నగదును విత్ డ్రా చేసుకుని నిల్వ ఉంచుకోవాలని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సూచించారు.