డబ్బు ఇచ్చేస్తా.. తీసుకోండి.. నన్ను వదిలేయండి.. విజయ్ మాల్యా
బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయి లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. రాజీకొచ్చారు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా వున్నానని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. తాను రుణాలను ఎగవేసే వ్యక్తిని కాదన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తూ.. బ్యాంకుల నుంచి రుణాలు పొంది పారిపోయానని సోషల్ మీడియా, మీడియా కోడైకూస్తోంది.
అందులో ఎలాంటి వాస్తవం లేదు. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు తాను రాజీ ప్రస్తావన తెచ్చాను. దాని గురించి ఎవ్వరూ నోరెత్తలేదు. విమాన ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కింగిఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా అలాంటి సమస్యల్లోనే చిక్కుకుందని.. కింగ్‌ఫిషర్ బాగా నడిచినంత కాలం ఎలాంటి విమర్శలు రాలేదు.
ఎయిర్‌లైన్స్ నష్టాల్లో కూరుకుపోవడం వల్లే అసలు సమస్యలు మొదలయ్యాయని మాల్యా ట్వీట్ చేశారు. దయచేసి నగదు తీసుకోవాలని.. తీసుకున్న మొత్తాన్ని వందశాతం తిరిగి చెల్లిస్తానని మాల్యా చెప్పారు.