మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (17:15 IST)

జైట్లీజీ చేసిన ఘనకార్యం చాలు... ఇక తప్పుకోండి : రాహుల్

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చిక్కుల్లో పడ్డారు. దేశం విడిచి వెళ్లిపోయే ముందు తాను జైట్లీని కలిసినట్లు విజయ్‌ మాల్యా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై ఒంట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చిక్కుల్లో పడ్డారు. దేశం విడిచి వెళ్లిపోయే ముందు తాను జైట్లీని కలిసినట్లు విజయ్‌ మాల్యా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై ఒంటికాలుపై లేస్తున్నాయి. అరుణ్ జైట్లీకి చెప్పే తాను లండన్‌కు వచ్చినట్టు మాల్యా ప్రకటించి కలకలం రేపారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.
 
తాజాగా అరుణ్‌ జైట్లీ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. జైట్లీపై విచారణకు ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్‌ చేశారు. 'విజయ్‌ మాల్యా బుధవారం లండన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. జైట్లీపై ప్రధాని వెంటనే విచారణకు ఆదేశించాలి. తనపై విచారణ జరుగుతున్నంత కాలం ఆయన ఆర్థిక మంత్రి పదవి నుంచి దిగిపోవాలి' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 
 
కాంగ్రెస్‌ నాయకుడు పి.ఎల్‌ పునియా స్పందిస్తూ.. 'ఇంతకుముందు పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జైట్లీ, మాల్యా మాట్లాడుకుంటుండగా నేను చాలా సార్లు చూశా. కావాలంటే అప్పటి సీసీటీవీ దృశ్యాలు పరిశీలించవచ్చు' అని అన్నారు. 

లండన్‌లో విజయ్‌మాల్యా కేసు విచారణ జరుగుతున్న వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు బయట విజయ్‌మాల్యా విలేకరులతో మాట్లాడుతూ... దేశం వదిలి వెళ్లిపోయే ముందు అన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు అరుణ్‌ జైట్లీని చాలా సార్లు కలిశా. రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు నేను చాలా మార్గాలు చెప్పాను. ఇది నిజం అని వ్యాఖ్యానించగా, ఇవి దేశంలో ప్రపకంపనలు సృష్టిస్తున్నాయి.