బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 మే 2017 (13:27 IST)

Who is Modi? ఆయనకేంటి ఇంత గౌరవం? స్పెయిన్ వాసుల ప్రశ్నలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పీఎం కుర్చీలో కూర్చొన్న సమయం కంటే.. విదేశీ పర్యటనల్లో గడుపుతున్న సమయమే అధికం. ఒకవైపు దేశ పరిపాలనలో తన ముద్రను చూపిస్తూ.. మరోవైపు ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఆయన తాజాగా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పీఎం కుర్చీలో కూర్చొన్న సమయం కంటే.. విదేశీ పర్యటనల్లో గడుపుతున్న సమయమే అధికం. ఒకవైపు దేశ పరిపాలనలో తన ముద్రను చూపిస్తూ.. మరోవైపు ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఆయన తాజాగా జర్మనీతో పాటు.. స్పెయిన్, మరో రెండు దేశాల పర్యటనలకు వెళ్లారు. 
 
తొలుత జర్మనీ పర్యటనను ముగించుకున్న మోడీ.. మంగళవారం స్పెయిన్‌ పర్యటనకు శ్రీకారం చుట్టారు. మోడీ రాక గురించి, అన్ని పత్రికలూ పతాక శీర్షికన వార్తలు రాస్తే, స్పెయిన్ వాసులు మాత్రం అత్యంత అమాయకంగా, ఈ నరేంద్ర మోడీ ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. 1988లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో స్పెయిన్‌లో అధికారికంగా పర్యటించగా, ఆ తర్వాత స్పెయిన్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీయే కావడం గమనార్హం. 
 
కాగా, స్పెయిన్ వాసులను భారత నేత గురించి అడుగుతూ తీసిన ఓ వీడియోలో పలువురు ఆయన్ను గుర్తించినప్పటికీ, మన దేశంలో ఇంత గౌరవాన్ని పొందుతున్న ఆయనెవరని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. ఇంకో వ్యక్తి అయితే, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయనేనని చెప్పడం గమనార్హం. ఓ వ్యక్తి ఆయనే 'యోగా డే'ని ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు.