గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (18:47 IST)

సూర్యుడి లోగుట్టుపై అధ్యయనం : నాసా స్టేట్మెంట్... ఎలాగంటారా?

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సంచలన నిర్ణయం తీసుకుంది. సూర్యుడి లోగుట్టును బహిర్గతం చేయాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే పలు గ్రహాలపైకి స్పేస్ క్రాఫ్ట్‌లను పంపి... అక్కడి వాతావరణ పరిస్థితులను అ

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సంచలన నిర్ణయం తీసుకుంది. సూర్యుడి లోగుట్టును బహిర్గతం చేయాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే పలు గ్రహాలపైకి స్పేస్ క్రాఫ్ట్‌లను పంపి... అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. తాజాగా సూర్యుడిపైకే శాటిలైట్‌ను పంపాలని నిర్ణయం తీసుకుంది. నాసా శాస్త్రవేత్తల ప్లాన్ ప్రకారం ఈ ఉపగ్రహాన్ని వచ్చే యేడాది పంపించనున్నారు. 
 
ఇందుకోసం సూర్యుడి ఉష్ణోగ్రతను తట్టుకునేలా ఓ రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రత్యేకంగా తయారు చేయనుంది. భూమికి 149 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిపైకి దీనిని పంపి అక్కడి వాతావరణంపై విస్తృత పరిశోధనలు నిర్వహించనున్నట్టు నాసా రీసెర్చ్ సైంటిస్ట్ ఎరిక్ క్రిస్టియన్ తాజాగా వెల్లడించారు. 
 
ఆయన చెప్పినట్టుగా నాసా ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను పంపితే... అంతరిక్ష పరిశోధనా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే. ప్రపంచంలో ఈ తరహా మిషన్ ఇదేకావడం గమనార్హం. అయితే, రోబోను సూర్యుడిపైకి సరాసరి పంపించాలనుకోవడం లేదని, దానికి వీలైనంత సమీపంలోకి పంపాలని మాత్రం నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్పేస్‌క్రాఫ్ట్‌ను డిజైన్ చేస్తున్నట్టు తెలిపారు.