శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి

సౌరకుటుంబంలో అతిపెద్ద చందమామ... ఫోటోలు వైరల్

సౌరకుటుంబంలో భూమికి ఉన్నట్లే ప్రతి గ్రహానికి చందమామ ఉంటాడు. వీటిలో గురు గ్రహానికి సౌరకుటుంబంలోనే అతిపెద్ద చందమామ ఉన్నాడు. దాని పేరు గానిమీడ్‌. నాసాకు చెందిన జునో స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడా చందమామ ఫొటో తీసి భూమిపైకి పంపించింది. గానిమీడ్ ఉపరితలానికి వెయ్యి కిలోమీటర్ల దగ్గరి వరకూ వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ అద్భుతమైన ఫొటోలు తీసింది. గత రెండు దశాబ్దాల్లో ఈ చందమామకు ఇంత దగ్గరగా వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ మరొకటి లేదు.
 
జునో తీసిన హైరెజల్యూషన్ ఫొటోలను నాసా పరిశీలిస్తోంది. అందులో అగ్నిపర్వత బిలాలు కూడా కనిపిస్తున్నాయి. జునోను పరిశీలిస్తున్న స్కాట్ బోల్టన్ స్పందిస్తూ.. జూపిటర్ ఆర్బిటర్‌లోని జునోక్యామ్ ఇమేజర్‌, స్టెల్లార్ రెఫరెన్స్ యూనిట్ స్టార్ కెమెరా ఈ ఫొటోలు తీశాయి. నీటిరూపంలో ఉన్న మంచుతో కూడిన ఓ భాగం మొత్తాన్నీ జునో ఫొటో తీయగలిగినట్లు నాసా వెల్లడించింది. ఈ ఫొటోను జూన్ 7న గానిమీడ్ దగ్గరగా వెళ్లిన సమయంలో జునో తీసింది.
 
గురుగ్రహానికి ఉపగ్రహమైన ఈ గానిమీడ్‌.. బుధ గ్రహం కూడా పెద్దగా ఉంటుంది. స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్న గానిమీడ్ వైపు ఫొటో తీసింది. రానున్న రోజుల్లో స్పేస్‌క్రాఫ్ట్ మరిన్ని ఫొటోలు తీసి పంపించనుంది. ఈ ఫొటోల వల్ల గానిమీడ్ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయని నాసా సైంటిస్టులు తెలిపారు. గురు గ్రహం చుట్టూ కొంత కాలంగా జునో స్పేస్‌క్రాఫ్ట్ తిరుగుతూనే ఉంది. 2011లో లాంచ్ చేయగా.. 2016లో ఇది గురుగ్రహ కక్ష్యలోకి చేరింది.