శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 మే 2016 (10:42 IST)

మాట మార్చిన డోనాల్డ్ ట్రంప్.. ముస్లింలపై తాత్కాలిక నిషేధం మాత్రమే విధించాలి!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. గతంలో అనేక రకాలైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాలు సుడిగుండంలో చిక్కుకున్న ఆయన.. తాజాగా మాట మార్చడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అమెరికాలోకి ముస్లింల రాకపై తాత్కాలిక నిషేధం విధించాలని మాత్రమే తాను అన్నానని వివరణ ఇచ్చారు. 
 
ముస్లింలపై నిషేధం అనేది కేవలం సూచన మాత్రమేనని, ఇంకా ఎవరూ ఏమీ చేయలేదని ఫాక్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. మన ముందు తీవ్రమైన సమస్య ఉన్నమాట నిజం. ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచమంతటా ఉంది. పారిస్‌లో ఉంది. (అమెరికాలోని) సాన్ బెర్నార్డినోలో ఉంది. కాదనే వారుంటే నేనేం చేయలేను. నేను మాత్రం కాదనను, అందుతే ముస్లింల రాకపై తాత్కాలిక నిషేధం విధించాలని మాత్రమే అన్నట్టు వ్యాఖ్యానించారు.
 
మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో ఆమోదయోగ్యత పెంచుకునేందుకు ఆయన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మరోవైపు తన అభ్యర్థిత్వంపై రిపబ్లికన్ పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న దృష్ట్యా సీనియర్ నాయకులతో సఖ్యతకు ప్రయత్నాలు ప్రారంభించారు. పలువురు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.