బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (15:03 IST)

'డిస్కవర్ ఆఫ్ బ్యూటీ'... ఫిదా చేస్తున్న ఒమన్ పర్యాటక అందాలు (Video)

ప్రపంచంలో ఉన్న అరబ్ దేశాల్లో ఒమన్ ఒకటి. ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని బాహ్య ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఆ దేశ పర్యాటక రంగం ఓ వీడియోను రూపొందించింది.

ప్రపంచంలో ఉన్న అరబ్ దేశాల్లో ఒమన్ ఒకటి. ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని బాహ్య ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఆ దేశ పర్యాటక రంగం ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఒమన్ పర్యాటక అందాలకు 'ఫిదా' అయిపోతూ ఈ వీడియోకు లైకులపై లైకులు కొడుతున్నారు. 
 
ఒమ‌న్ టూరిజాన్ని ఎలివేట్ చేయ‌డం, ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం కోసం ఆ దేశ పర్యాటక శాఖ ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా ఒమ‌న్‌లో ఉన్న అంద‌మైన‌, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను వీడియో తీసి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇక‌, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో నెంబ‌ర్ 2 ట్రెండింగ్‌లో కొన‌సాగుతోంది. 
 
భారత్‌కు చెందిన ఓ యువ‌కుడు త‌న స్నేహితుని పెళ్లి కోసం ఒమ‌న్‌కు వెళ్ల‌డం.. అక్క‌డి అందాల‌కు ఫిదా అయిపోవ‌డంతో ఒమ‌న్‌లో ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌న్నింటినీ త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ప‌ర్య‌టిస్తాడు. "ఐ వాంట్ ఫ్రీడ‌మ్ ఫ్ర‌మ్ మీ" అంటూ సాగే బ్యాగ్ గ్రౌండ్ సాంగ్‌తో తీసిన ఈ వీడియో కూడా సూప‌ర్బ్‌గా రావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ వీడియోకు తెగ పాజిటివ్ కామెంట్లు వ‌స్తున్నాయి.