సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 జులై 2017 (10:16 IST)

నీటి కొలనులో గజరాజు స్విమ్మింగ్ స్టంట్స్.. (Video)

మనుషులే కాదు.. నేను కూడా ఈత కొడతానంటోంది ఓ గజరాజు. అనడమే కాదు.. చేసి చూపించింది కూడా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అమెరికాలోని ఆరిజోనా జూ అధికారులు సోషల్ మ

మనుషులే కాదు.. నేను కూడా ఈత కొడతానంటోంది ఓ గజరాజు. అనడమే కాదు.. చేసి చూపించింది కూడా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అమెరికాలోని ఆరిజోనా జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. జూలో ఉండే సముద్ర అనే ఏనుగు స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. 
 
వీడియో విషయానికొస్తే.. గజరాజు ఆనందంగా నీటిలోకి వచ్చి... తొండంతో పాటు కాళ్లతో నీటిని కొడుతూ ఈదింది. కొన్ని స్టంట్స్‌ కూడా చేసింది. ఒక నిమిషం ఐదు సెకన్లు ఉండే ఈ వీడియోలో వీక్షకులని బోలెడంత ఎంటర్‌టైన్‌ చేసింది. జంతుప్రదర్శనశాలలో ఓ జంతు ప్రేమికుడు పుచ్చకాయను వెంటనే ఏనుగు అందుకుని తిన్నది. మొత్తానికి ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే దాదాపు 14 లక్షల 98 వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు.