శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (11:44 IST)

మొజాంబిక్ తీరంలో విషాదం.. పడవ మునిగి 90 మంది జలసమాధి!!

Boat Capsizes
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు జలసమాధి అయ్యారు. జాలర్లు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో 90 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి 130 మంది వరకు ఉన్నట్టు సమాచారం. బోటులో కెపాసిటీకి మించి జాలర్లు ఉండటం వల్లే ఈ ఘోరం జరిగినట్టు సమాచారం. అయితే, మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడం వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ దుర్ఘటం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన తీరానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, కలరా వ్యాప్తి అంటూ వదంతుల నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళుతున్నట్టు నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళుతుండగా ఈ పడవ మునిగిందని చెబుతున్నారు. ఇదిలావుంటే, మొజాంబిక్ దేశంలో గత యేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు 15 వేల కలరా కేసులు వెలుగు చూశాయి. అలాగే, 32 మంది మృత్యువాతపడినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.