సంస్కృత-హిందీ-ఇంగ్లీష్ నిఘంటువును ప్రారంభించిన ఆక్స్‌ఫర్డ్
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (ఓయుపి) శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులకు సంస్కృత భాషను అందుబాటులోకి తీసుకురావడానికి త్రిభాషా సంస్కృత-హిందీ-ఇంగ్లీష్ నిఘంటువును ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఇది విద్య మంత్రిత్వ శాఖతో ఏకీభవించి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, నేర్చుకోవడం అనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ దృక్పథంతో అదే సమయంలో ద్విభాషా నిఘంటువులు భారతదేశ పోర్ట్‌ఫోలియోలో కవర్ చేయబడిన భాషల సంఖ్యను 13కి (దీనిలో 9 క్లాసికల్ లాంగ్వేజెస్‌ని కలిగి ఉంటుంది) పెంచింది.
ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులు ఇప్పుడు సంస్కృతం, బెంగాలీ, అస్సామీ, కన్నడ, మలయాళం, ఒడియా, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, భాషా వైవిధ్యం, భాషల సంరక్షణ, సుసంపన్నత కోసం అంకితం చేయబడింది. కొత్త ఆక్స్‌ఫర్డ్ సంస్కృతం-హిందీ-ఇంగ్లీష్ డిక్షనరీలో సంస్కృతం నేర్చుకునే వారి కోసం జాగ్రత్తగా ఎంపిక చేసిన 25,000 పదాలను చేర్చారు.