సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (13:01 IST)

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : వెనుకంజలో వినేశ్ ఫొగాట్

vinesh phogat
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పుంజుకుని, విజయం దిశగా దూసుకెళుతుంది. అయితే, జులానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఇపుడు వెనుకబడిపోయింది. ఈ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కవిత దలాల్, జేజేపీ నుంచి అమర్జీత్ దాండా, బీజేపీ నుంచి యోగేశ్ బైరాగిలు పోటీ చేస్తున్నారు. 
 
అయితే, వినేశ్ ఫొగాట్‌పై బీజేపీ అభ్యర్థి యోగేశ్ దాదాపు 1200 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్‌లో 3 వేలు, ఐదో రౌండ్‌లో 1417, 6 రౌండ్ ముగిసే సమయానికి 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
కాగా, హర్యానాలో తొలుత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య. హోరాహోరీ కనిపించింది. కానీ, ఆ తర్వాత బీజేపీ దూసుకెళ్లింది. బీజేపీ 48 సీట్లలో, కాంగ్రెస్ 34 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ, ఐఎన్ఎల్డీ, ఐఎన్డీలు ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి.