ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (09:15 IST)

హర్యానాలో హస్తం - జమ్మూకాశ్మీర్‌లో హంగ్.. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్

haryana state
హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. అలాగే, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తెలిపాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబరు 8వ తేదీన వెల్లడికానున్నాయి. 
 
ఇక పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడదుల, హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే హవా అని జమ్మూకాశ్మీర్‌‍లో సంకీర్ణం వస్తుందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫ సర్వే పేర్కొంది. హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. 
 
జమ్మూకాశ్మీర్‌లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేవని ఉన్న వాటిలోనే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొంది. ఇంకా ఇతర మీడియా సంస్థలు కూడా తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. 
 
హర్యానా ఎగ్జిట్ పోల్స్.. మొత్తం స్థానాలు 90
పీపుల్స్ పల్స్ సర్వే .. కాంగ్రెస్ 55, బీజేపీ 26, ఐఎన్‌ఎల్డీ 2-3, జేజేపీ 1
సట్టా బజార్ సర్వే ... కాంగ్రెస్ 50,  బీజేపీ 25
ఏబీపీ సీ ఓటర్ సర్వే... బీజేపీ 78, కాంగ్రెస్ 8
న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ సర్వే ... బీజేపీ 75, కాంగ్రెస్ 10
 
జమ్మూకాశ్మీర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు - మొత్తం సీట్లు 90
జేకేఎన్‌సీ సర్వే 33-35, బీజేపీ 23-27, కాంగ్రెస్ 13-15, జేకే పీడీపీ 7-11, ఏఐపీ 0-1, ఇతరులు 4-5
 
రిపబ్లిక్ మాట్రిక్ సర్వే
బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఎన్సీ 15, పీడీపీ 28, ఇతరులు 7
ఇండియా టుడే సీ ఓటర్ సర్వే.. ఎన్సీ కూటమి 11-15, బీజేపీ 27-31, పీడీపీ 0-2, ఇతరులు 0-1