ప్రేమ వివాహం చేసుకున్నాడు.. రూ.17లక్షల జరిమానా విధించిన పాకిస్థాన్ కోర్టు
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడికి పాకిస్థాన్‌లో భారీ జరిమానా పడింది. పాకిస్థాన్ బడుగువర్గాలకు చెందిన కోర్టు ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఓ యువకుడికి రూ.17లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడికి పాకిస్థాన్‌లో భారీ జరిమానా పడింది. పాకిస్థాన్ బడుగువర్గాలకు చెందిన కోర్టు ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఓ యువకుడికి రూ.17లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. సింధు ప్రావిన్స్, తంగ్వాణీ సమీపంలోని బజర్ అబాద్ అనే గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిని చట్టప్రకారం వివాహం చేసుకున్నాడు.
ఈ వివాహానికి వధువు తల్లిదండ్రులు అడ్డు తగిలారు. ఈ వివాహం చెల్లదని కోర్టుకెక్కారు. ఇందులో భాగంగా బడుగు వర్గాలకు చెందిన జిర్గాలోని కోర్టులో కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన కోర్టు యువతిని పెళ్లాడిన యువకుడకి రూ.17లక్షల జరిమానా విధించింది. అంతేగాకుండా ఈ మొత్తాన్ని యువతి తల్లిదండ్రులకు ఈ వివాహంతో ఏర్పడిన పరువునష్టం కోసం కట్టాలని కోర్టు తీర్పునిచ్చింది.