శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (09:33 IST)

నోరుజారిన పాకిస్థాన్ రక్షణ మంత్రి.. సిరియాపై అణుదాడి చేస్తామని ప్రకటన

పాకిస్థాన్ పాలకులకు నోటిదూల కాస్త ఎక్కువనే చెప్పాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై కూడా వారు కాస్తంత సీరియస్‌గానే తీసుకుంటారు. ఆ వార్తల్లో నిజమెంతో తెలుసుకోకుండానే నోరు జారుతుంటారు. తాజాగా ఆ దేశ రక్షణ

పాకిస్థాన్ పాలకులకు నోటిదూల కాస్త ఎక్కువనే చెప్పాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై కూడా వారు కాస్తంత సీరియస్‌గానే తీసుకుంటారు. ఆ వార్తల్లో నిజమెంతో తెలుసుకోకుండానే నోరు జారుతుంటారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఇదేవిధంగా పప్పులో కాలేశారు. 
 
సిరియాలో పాకిస్థాన్ సేనలను మొహరిస్తే అందుకు ప్రతిగా అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నట్లు పుకార్లు వచ్చాయి. ఓ విదేశీ ఆంగ్ల వెబ్‌సైట్‌లో ఇజ్రాయెల్ పాకిస్థాన్‌పై అణుదాడి చేస్తోందని ఆ దేశ మాజీ రక్షణ శాఖ మంత్రి మొషే యాలన్ అన్నట్లు వార్త వచ్చింది.
 
వీటిని నమ్మిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఇజ్రాయెల్ ఒక్కటే అణుశక్తి కలిగిన దేశం కాదని పాకిస్థాన్ కూడా అణుశక్తి కలిగిన రాజ్యమేనని తన ట్విట్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా, పాకిస్థాన్ కూడా అణుదాడి చేస్తుందని హెచ్చరించారు. 
 
వీటిపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఆ వార్త సత్యదూరమని పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆసిఫ్‌కు రీట్వీట్ కూడా చేసింది. యాలన్ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని పేర్కొంది.