సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (09:03 IST)

పాకిస్థాన్‌ను మంచేసిన భారీ వరదలు.. వెయ్యి మంది మృతి

pak floods
దాయాది దేశం పాకిస్థాన్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. గత 30 యేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశాన్ని వరదలు తాకాయి. ఈ వరద నీటి ప్రవాహం దెబ్బకు అనేక ప్రాంతాల్లో దాదాపు 150కిపైగా వంతెనలు కొట్టుకునిపోయాయి. అలాగే, వెయ్యిమందికిపైగా వరద బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో పాకిస్థాన్‌కు సాయం అందించేందుకు ఖతర్, ఇరాన్ వంటి దేశాలు ముందుకు వచ్చాయి. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో భారీ వదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 1033 మంది చనిపోయినట్టు పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత 24 గంటల్లోనే 119 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. అలాగే, ఈ వరదల కారణంగా 1500 మంది వరకు గాయపడినట్టు పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 
 
పాకిస్థాన్ దేశంలో ఈ తరహాలో వర్షాలు కురవడం, వరదలు సంభవించడి గత 30 యేళ్ళలో ఇది తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా పాక్‌లో సగటు వర్షపాతం 132.3 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఈ యేడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఏకంగా 385 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదైంది. 
 
ఈ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఫలితంగా దాదాపు 3.30 కోట్ల మంది వరద బాధితులయ్యారని వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.