నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు : 33మంది మృతి
హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఇటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో శనివారం 33 మంది మరణించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడంతో ఒకే కుటుంబానికి చందిన ఎనిమిది మంది సహా మొత్తం 22 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన ఘటనల్లో పదిమంది గాయపడగా, మండీలో ఆరుగురు గల్లంతయ్యారు.
ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందగా, పదిమంది గల్లంతయ్యారు. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పాటు వంతెనలు కొట్టుకుపోవడంతో పలుగ్రామాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.