మధ్యప్రదేశ్ గృహాల్లోకి వచ్చిన భారీ మొసలి
గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి. వాగులు, వంకలు, చెరువులు, చిన్నపాటి నదులు పొంగిపొర్లుతున్నాయి.
ముఖ్యంగా, శివపురి జిల్లాలో వాగులు వంకలు నదులు ఉప్పొంగడంతో అనేక నివాసాల్లోకి నీరు వచ్చిచేరింది. దీంతో మొసళ్లు నివాసాల్లోకి వచ్చి చేరాయి. దీంతో స్థానికలు భయభ్రాంతులకు గురయ్యారు.
మొసళ్లు జనావాసాల్లోకి రావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మొదట బస్టాండ్ వద్ద ఓ మొసలి కనిపించిందని గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత నివాసాల మధ్యకు చేరుకుని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.
దీంతో ఈ మొసళ్లను పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న మాధవ్ నేషనల్ పార్క్ నుంచి అటవీ శాఖ అధికారులు వచ్చారు. గంటల పాటు శ్రమించి ఓ 8 అడుగుల పొడవున్న మొసలిని బంధించారు. అనంతరం సంఖ్యా సాగర్ లేక్‌లో వదిలేశారు.