గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (14:26 IST)

భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌గఢ్ ప్రమాణ స్వీకారం

jandhakar
భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌గఢ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగింది. 
 
ఉపరాష్ట్రపతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇంకా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా విచ్చేశారు. 
 
ఆగస్టు ఆరో తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ధన్‌గఢ్ విపక్షాలు మద్దతు పలికిన మార్గరెట్ అల్వాను ఓడించారు. ధన్‌గఢ్‌కు 74.36 శాతం ఓట్లు వచ్చాయి. 1997 నుంచి జరిగిన చివరి ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. 
 
ఇక ధన్‌గఢ్‌కు ఏన్డీయేతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం విశేషం. వీటిలో నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్, వైసీపీ, మాయావతికి చెందిన బీఎస్పీ తదితర పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్‌కు దూరంగా ఉంది.