ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (13:01 IST)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వారంతా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ఆ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ప్రమాణం చేయించారు. 
 
ప్రమాణం చేసిన వారిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుదర్ష ఊటుకూరు శ్రీనివాస్‌లు ప్రమాణం చేశారు. ఆ తర్వాత అదనపు న్యాయమూర్తులుగా బొప్పన వరాహ లక్ష్మీ నరసింహా చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జున రావు, దుప్పల వెంకటరమణలతో ప్రమాణం చేయించారు. 
 
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తల్లి మరణించడంతో న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో గవర్నర్‌ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.