శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:40 IST)

ఈ నెల 8న ఏపీలో ఐసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన ఐసెట్ పరీక్షా ఫలితాలను వెల్లడికానున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం సంబంధించి ఏపీ ఐసెట్-2022 పరీక్షా ఫలితాలను ఈ నెల 8వ తేదీన వెల్లడికానున్నాయి.
 
రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 25వ తేదీన పలు పరీక్షా కేంద్రాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ షీట్ విడుదలైంది.
 
ఇక ఆగస్టు 8న ఏపీఐసెట్ ఫలితాలను వెల్లడించాల్సివుంది. ఈ ఐసెట్ ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెల్సిందే.