సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (12:59 IST)

జనజీవనంలోకి మొసలి.. వీడియో వైరల్

Crocodile
Crocodile
భారీ వర్షాల కారణంగా జనజీవనంలోకి నీటి జంతువులు ప్రవేశిస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌లోని ఓ కాలనీలోకి మొసలి ప్రవేశించింది. అయితే ఆ మొసలిని రక్షించి సమీపంలోని సరస్సులో వదిలిపెట్టేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. శివపురి జిల్లాకు చెందిన నల్లా సరస్సు వరద నీటితో మునిగింది. దీంతో మొసలి కాలనీలోకి ప్రవేశించింది. నీటిలో అలా తేలుతూ కనిపించడంతో జనం భయంతో వణికిపోయారు. 
 
అయితే అటవీ శాఖా అధికారులు ఆ మొసలిని పట్టుకున్నారు. చెరువులో వదిలిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
నేషనల్ పార్క్ నుండి రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి, గంటపాటు పోరాడి మొసలిని కాపాడారు. ఆపై ఎనిమిది అడుగుల ఆ మొసలిని నేషనల్ పార్క్ ఆవరణలో ఉన్న లేక్‌లో వదిలేశారు. 
Crocodile
Crocodile
 
కాగా మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జబల్‌పూర్, భోపాల్, నర్మదాపురం డివిజన్లలో అలర్ట్ ప్రకటించారు.