శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (08:55 IST)

అత్యాచారానికి పాల్పడితే కెమికల్ క్యాస్ట్రేషన్ .. ఎక్కడ?

పొరుగుదేశం పాకిస్థాన్ దేశ పార్లమెంట్ తీవ్రమైన కఠిన చట్టానికి ఆమోదముద్ర వేసింది. అత్యాచారాలకు పాల్పడిన వారికి కెమికల్ క్యాస్ట్రేషన్‌ ద్వారా నపుంసకత్వం వచ్చేలా చేయనున్నారు. అయితే, ఒకటి కంటే ఎక్కువ లైంగికదాడులకు పాల్పడే వారికి ఈ తరహా కఠిన శిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు దేశ పార్లమెంట్ క్రిమినల్ లా సవరణ బిల్లు 2021ను ఆమోదించింది. 
 
ఈ చట్టం మేరకు ఎవరైనా ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు అత్యాచారాలకు పాల్పడిన పక్షంలో ఆ వ్యక్తి భవిష్యత్తులో శృంగారానికి పనికిరాకుండా చేయడమే ఈ కెమికల్ క్యాస్ట్రేషన్ అంటారు. ముఖ్యంగా సౌత్ కొరియా, పోలాడ్, చెక్ రిపబ్లిక్, అమెరికా వంటి పలు దేశాల్లో ఈ తరహా అమల్లోవుంది. ఇపుడు పాకిస్థాన్‌లో అమలు చేయనున్నారు.