సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (15:30 IST)

పాకిస్థాన్ సంచలనం: అత్యాచార నిందితులకు అది కట్..?

పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో రెండు కొత్త ఆర్డినెన్స్‌లను అమలులోకి తెచ్చింది. ఫలితంగా దేశంలో అత్యాచార కేసులు, లైంగిక వేధింపుల కేసులను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. కెమికల్‌ కాస్ట్రేషన్‌ ద్వారా రేపిస్టులకు పుంసత్వాన్ని దెబ్బతీయాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. రేప్ కేసులకు సంబంధించి విచారణ కొరకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది.
 
ఈ కొత్త ఆర్డినెన్స్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అన్ని వయస్సుల స్త్రీలను మహిళలుగా ఈ కొత్త చట్టంలో భావిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో అమలవుతున్న నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలలోపు బాలికలపై అత్యాచారం చేస్తే మాత్రమే రేప్ కేసుగా నమోదు చేసుకుంటున్నారు. పుంసత్వాన్ని దెబ్బతీయడం దోషులు చేసిన రేప్ కేసుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
 
పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశంలో యాంటీ రేప్‌ సెల్స్‌ ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. గతంలో పాకిస్తాన్‌లో టూ ఫింగర్‌ టెస్ట్ ద్వారా కన్యత్వాన్ని నిర్ధారించేవారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ పరీక్షలపై సైతం పాక్ ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం.