గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మే 2020 (15:03 IST)

కరోనా సాకుతో హఫీజ్‌ సయీద్‌తో పాటు ఉగ్రవాదులు రిలీజ్

కరోనా సాకుతో పాకిస్థాన్ కుట్రబుద్ధిని వెల్లగక్కింది. కరోనాను వెంట బెట్టుకుని పాకిస్థాన్.. ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేసింది. ప్రపంచ దేశాలు కరోనాతో తల్లడిల్లిపోతుంటే.. పాకిస్థాన్ కరోనా మహమ్మారి పేరు చెప్పి కరుడుగట్టిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేసింది. జైల్లో ఉన్న ఖైదీల మధ్య కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సాకుతో అనేక మంది ఉగ్రవాదులకు స్వేచ్ఛ ప్రసాదించింది. 
 
కాగా లాహోర్ లోని ఓ జైల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఉండగా, వారిలో కొందరికి కరోనా సోకిందని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్‌ కోర్టు అతడికి 11ఏళ్ల జైలు శిక్షను విధించింది. 
 
అమెరికా ఒత్తిడితో భద్రతా మండలి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ తర్వాత ముంబై పేలుళ్ల కేసు, భారత్‌లో విధ్వంసాలకు కుట్రలు తదితర కేసులకు సంబంధించి సయీద్‌ను తమకు అప్పగించాలని భారత్‌ కోరుతూ వస్తోంది. అయితే లష్కరే తాయిబా చీఫ్‌, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను కరోనా సాకుతో పాక్ విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.