శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (11:44 IST)

పాక్ కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి - 68 మంది జ‌వాన్ల‌కు క‌రోనా

పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు.

శుక్రవారం బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్‌ సెక్టార్‌ వద్ద పాకిస్థాన్‌ కాల్పులకు పాల్పడగా ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురిలో ఇద్దరు సైనికులు శనివారం ఉదయం మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే, క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. ఈస్ట్ ఢిల్లీలోని ఓ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియ‌న్‌కు చెందిన‌ జ‌వాన్లు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు.

తాజాగా మ‌రో 68 మంది జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డ్డ సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య 127కు చేరింది. వారిలో ఒక‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగ‌తా 125 మందిలో 122 మంది ఈస్ట్ ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు చెందిన జ‌వాన్లే కావ‌డం గ‌మ‌నార్హం.