సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:33 IST)

పంజాబ్‌ను నీట ముంచిన పాకిస్థాన్

పాకిస్థాన్ ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలు చేయకుండా సట్లెజ్ నది రిజర్వాయర్ గేట్లు ఎత్తేయడంతో భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం నీట మునిగింది. పాక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు భారత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
గేట్లు ఎత్తివేయడంతో సట్లెజ్ నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఫిరోజ్ పూర్ జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. వెంటనే అలర్టైన పంజాబ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. 
 
ఫిరోజ్ పూర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కశ్మీరుకు భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిందనే కోపంతో పాక్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసినట్లు భావిస్తున్నారు అధికారులు.