1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 మే 2025 (12:07 IST)

భారత్ అంటే అంత భయం అందుకే - పాక్ సైనికులే కాదు ఉగ్రవాదులు ఉ... పోసుకుంటున్నారు...

Hafiz Saeed
భారత్ అంటే శత్రుదేశం పాకిస్థాన్ పాలకులు వణికిపోతున్నారు. చివరకు పాకిస్థాన్ ఆర్మీకి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే భారత్‌తో యుద్ధమంటేనే పాక్ సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక పాకిస్థాన్ పాలకులు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్ సైనిక బలగాలు రక్షణ కల్పిస్తున్నప్పటికీ ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో ఉచ్చపోసుకుంటూ, బంకర్లలో దాక్కుంటున్నారు. 
 
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఏ క్షణమైనా ప్రతీకార దాడి / సీక్రెట్ ఆపరేషన్ చేపట్టవచ్చన్న భయంతో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అప్రమత్తమైంది. నిషేధిత ఉగ్రసంస్థ లష్కర్ తోయిబా (ఎల్.ఈ.టీ), జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు భద్రతను కట్టుదిట్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పహల్గాం దాడికి లష్కర్ నైతిక బాధ్యత వహించింది. 
 
కరుడుగట్టిన హఫీజ్ సయాద్‌ను కాపాడుకోవడం కోసం గతంలో స్పెషల్ సర్వీస్ గ్రూపులో పని చేసిన కమాండోలను పాక్ ప్రభుత్వం నియమించింది. లాహోర్‌లోని మొహల్లో జోహార్‌తో సహా అతని నివాసాలవద్ద అదనపు సిబ్బందిని కూడా మొహరించింది. సాధారణ పౌరుల ఇళ్లు, ఒక మసీదు, మదర్సాతో జన సాంద్రత ఉండే ప్రాంతాలలో ఉద్దేశపూర్వకంగా సాయిద్ నివాసం ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. అలాగే, అతడిని నివాసాన్ని ఏకంగా తాత్కాలిక జైలుగా మార్చి, చుట్టుపక్కల కిలోమీటరు పరిధిలోని కదలికలను పసిగట్టేందుకు గెశ్చర్ డిటెక్షన్ సీసీటీవీ కెమెరాలతో పాటు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.