సింహంపైన కూర్చుని పాక్ పెళ్లికొడుకు ఊరేగాడా? పంజా విసరలేదా?
పెళ్లి కుమారుడు సాధారణంగా ఊరేగింపుగా కారులోనూ లేదా గుర్రంపై తీసుకొస్తారు. అయితే ఓ బిలియనీర్ కుమారుడు మాత్రం తన స్థాయికి తగ్గట్టుగానే కోరుకున్నాడు. తన పెళ్లి ఊరేగింపు సింహంపై జరగాలని కోరుకున్నాడు. కోరు
పెళ్లి కుమారుడు సాధారణంగా ఊరేగింపుగా కారులోనూ లేదా గుర్రంపై తీసుకొస్తారు. అయితే ఓ బిలియనీర్ కుమారుడు మాత్రం తన స్థాయికి తగ్గట్టుగానే కోరుకున్నాడు. తన పెళ్లి ఊరేగింపు సింహంపై జరగాలని కోరుకున్నాడు. కోరుకున్నట్లే పాకిస్థాన్‌కు చెందిన ఆ బిలియనీర్ కుమారుడిని సింహంపై ఊరేగిస్తూ తీసుకొచ్చారు. ఇక్కటో ట్విస్ట్ ఏంటంటే? వరుడు సింహంపై స్వయంగా కూర్చుని ఊరేగలేదు.
పాకిస్థాన్‌కి చెందిన షేక్ ఇర్ఫాన్ తన పెళ్లిలో ఓ ట్రక్కుపై సింహం ఉన్న బోను ఎక్కించి దానిపై ఓ కుర్చీ వేసుకుని దర్జాగా వూరేగుతూ వచ్చాడు. వేడుకలో అలంకరించే పూల నుంచి తినే ఆహారం వరకు అన్నీ రాయల్‌గా ఉండాలన్న కోరికతో ఇర్ఫాన్ తన తండ్రి షేక్ హస్మత్‌తో కలిసి ఈ స్థాయిలో ఏర్పాట్లు చేశాడు.
ఈ వేడుకలో అనేక మంది పాల్గొన్నారు. వరుడు ముఖానికి కప్పిన షెహ్రా పూర్తిగా బంగారంతో తయారు చేశారు. 15వేల మంది ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. పాల్గొన్న వారికి బంగారు ఆభరణాలు, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానుకగా ఇచ్చారు. అలాగే ఈ పెళ్లికి కట్నంగా రూ.5కోట్లు తీసుకున్నారు.