1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (18:31 IST)

రష్యాలో విమానం గల్లంతు

మాస్కో: రష్యాలోని ఓ ప్రయాణికుల విమానం గల్లంతైంది. ఫార్‌ ఈస్ట్‌ ప్రాంతంలో పెట్రోపవ్లోస్క్‌- కామ్‌చట్‌స్కీ నుంచి పలానా వెళ్తున్న ఓ విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సంబంధాలు తెగిపోయాయి.

షెడ్యూల్‌ ప్రకారం ల్యాండింగ్‌ కూడా జరగలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలిస్తున్నారు. ఘటన సమయంలో విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
 
విమానం సముద్రంలో పడిపోయిందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదా పలానా పట్టణం సమీపంలోని ఓ బొగ్గు గని ప్రాంతంలో కూలిపోయి ఉండొచ్చని స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్న ప్రాంతాలకు సహాయక సిబ్బంది బయల్దేరారు.