శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (16:21 IST)

భర్తను కట్టేసి.. గర్భిణిపై సామూహిక అత్యాచారం

woman victim
పాకిస్థాన్ దేశంలో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్లెదుటే గర్భిణి భార్యపై అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో జీలం నగరంలో ఐదుగురు దండుగులు ఓ మహిళ ఇంట్లోకిచ చొరబడ్డారు. ఆ సమయంలో ఆమె, భర్తతో కలిసివుండగా, భర్తను కొట్టి ఇంట్లోనే కట్టేశారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ లైంగిక దాడి తర్వాత ఆ గర్భిణి స్వయంగా ఆస్పత్రికి వెళ్లింది. అలాగే, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఆమె రక్త నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కాగా, ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై పాకిస్థాన్‌‌లో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే.