మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (09:04 IST)

సగంలో కండోమ్ తీస్తే శిక్షే.. అమెరికాలో సరికొత్త బిల్లు

కాలిఫోర్నియాలో సంభోగ సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించకూడదు. ఒకవేళ అలా చేస్తే దాన్ని ఇకపై నేరంగా పరిగణించడంతో పాటు శిక్షార్హులు అవుతారు. ఇదే విషయమై ఏబీ 453 పేరిట కాలిఫోర్నియా కొత్త బిల్లును ప్రతిపాదించింది.

ప్రస్తుతం ఈ బిల్లు కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ న్యూసమ్ వద్దకు చేరింది. అక్టోబర్ 10 వరకు గవర్నర్‌కు ఈ బిల్లుపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందితే మాత్రం ఇలాంటి సంచలన బిల్లు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచిపోనుంది.

లైంగిక వేధింపులకు సంబంధించి కాలిఫోర్నియా సివిల్ కోడ్‌లోని సెక్షన్ 1708.5‌ను సవరిస్తూ 453 బిల్లును తీసుకురావడం జరిగింది. సంభోగ సమయంలో ఏ విధంగాను భాగస్వామిని గాయపరిచేలా వ్యవహరించడం నేరం అని 1708.5 సెక్షన్ పేర్కొంటోంది.

అంటే.. భాగస్వామి(ఆమె, అతడు) జననాంగాలను, ఇతర ప్రైవేట్ పార్ట్స్‌ను గాయపరచకూడదు. దీనికి కొనసాగింపుగా తీసుకొచ్చిందే 453 బిల్లు. శృంగార సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్స్ తొలిగించడానికి వీల్లేదు.