శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:11 IST)

రియల్ లైఫ్ టార్జార్‌ను కాటేసిన కేన్సర్ మహమ్మారి

గత నాలుగు దశాబ్దాలుగా అడవుల్లో జీవనం సాగిస్తూ వచ్చిన రియల్ లైఫ్ టార్జాన్ ఇకలేరు. కేన్సర్ వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన వయసు 52 యేళ్లు. ఈయన కాలేయ క్యాన్స‌ర్‌తో క‌న్నుమూశాడు. 
 
1972లో వియ‌త్నాంపై అమెరికా యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో అమెరికా వేసిన ఓ బాంబు హో వాన్ లాంగ్ ఉంటున్న ఇంటిపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో అత‌డి త‌ల్లి, ఇద్ద‌రు తోబుట్టువులు మ‌ర‌ణించారు. 
 
ఇక అప్ప‌టి నుంచీ లాంగ్‌ అక్క‌డి కువాంగ్ ఎన్‌గాయ్ ప్రావిన్స్‌లోని టే ట్రా జిల్లాలో ఉన్న ద‌ట్ట‌మైన అడ‌విలోకి వెళ్లిపోయాడు. అత‌నితోపాటు తండ్రి, మ‌రో సోద‌రుడు కూడా ఉన్నారు. 41 ఏళ్ల పాటు వాళ్లు అలా అడ‌విలోనే ఉన్నారు.
 
2013లో అత‌ని తండ్రి హో వాన్ థాన్ ఆరోగ్యం క్షీణించిన సంద‌ర్భంలో అత‌డి పెద్ద‌న్న హో వాన్ ట్రి విన‌తి మేర‌కు లాంగ్‌, అత‌డి తండ్రి తిరిగి నాగ‌రిక ప్ర‌పంచంలోకి వ‌చ్చారు. అప్పటి నుంచి నాగరికత ప్రపంచంలో జీవిస్తూ వచ్చిన ఆయన తాజాగా మృతి చెందారు.