మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:39 IST)

బ్రెజిల్‌లో 245 మంది... 30 మీటర్ల ఎత్తు నుంచి దూకేశారు.. (వీడియో)

బ్రెజిల్‌లో రికార్డు నమోదైంది. ఓ రికార్డు కోసం 245 మంది స్త్రీ, పురుషులు ఒకరి చేయిని ఒకరు పట్టుకుని 30 మీటర్లు ఎత్తున్న వంతెన పైనుంచి ఒకేసారి కిందకు దూకి విన్యాసాలు చేశారు. తద్వారా గతంలో ఓ వంతెనపై నుం

బ్రెజిల్‌లో రికార్డు నమోదైంది. ఓ రికార్డు కోసం 245 మంది స్త్రీ, పురుషులు ఒకరి చేయిని ఒకరు పట్టుకుని 30 మీటర్లు ఎత్తున్న వంతెన పైనుంచి ఒకేసారి కిందకు దూకి విన్యాసాలు చేశారు. తద్వారా గతంలో ఓ వంతెనపై నుంచి ఒకేసారి దూకిన వారి సంఖ్య 149 కాగా, ఆ రికార్డును వీరు అధిగమించారు.

వివరాల్లోకి వెళితే.. శావ్ పావ్‌లోకు సమీపంలో ఉండే హోర్టోలాండియా సమీపంలోని ఓ బ్రిడ్జిపై నుంచి తాళ్లు కట్టుకుని అందరూ ఒకేసారి రోప్ కట్టుకుని జంపింగ్ చేశారు. 
 
దూకిన వెంటనే ఉయ్యాలలా ఊగుతూ.. విన్యాసాలు చేశారు. సాధారణ బంగీ జంప్ తో పోలిస్తే కట్టుకున్న తాడు వెనక్కు బౌన్స్ కాదు. వీరంతా నైలాన్ తాళ్లు కట్టుకుని ఈ ఫీట్ చేశారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఈ వీడియోను మీరూ చూడండి.