సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (13:30 IST)

ఆమె ఎడబాటును భరించలేక ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

ప్రియురాలు తన నుంచి దూరమైందనే ఆక్రోషంతో ప్రియుడు ఆమెను వెతికి పట్టుకుని అతికిరాతకంగా హతమార్చాడు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఇటలీ రాజధాని రోమ్ యూనివర్శిటీ విద్యార్థిని సారా డి పీట్రంటోనియో (22), విన్కెంజో పడానో (27) గాఢంగా ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. కానీ ఏమైందో ఏమోగాని సారా ఇంకొకరితో ప్రేమాయణం నడిపింది. కాలక్రమేణా విన్కెంజోకు సారా దూరమైంది. ఆమె దూరాన్ని విన్కెంజో భరించలేకపోయాడు. ఆమెను దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు.
 
కానీ, అవేమి ఫలించకుండా పోయింది. ఆ ప్రేమ కాస్త కసిగా మారింది. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సారా వెళ్తున్న కారును ఆపి విన్కెంజో నిప్పుపెట్టాడు. ఆమె కారులోంచి దిగి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, ఆమెను వెంటాడి పట్టుకుని సజీవదహనం చేశాడు. సారా ముఖం, ఒంటిపై ఆల్కాహాల్ పోసి, సిగరెట్ లైటర్తో నిప్పుపెట్టాడు. 
 
హత్య జరిగిన ప్రాంతంలోని కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు విన్కెంజోపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొదట సారాను తాను చంపలేదని విన్కెంజో నిరాకరించినా.. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా నేరాన్ని ఒప్పుకున్నాడు. తన 25 ఏళ్ల కెరీర్లో ఇంతటి ఘోరమైన హత్య చూడలేదని పోలీస్ అధికారి లూగి సిలిపో చెప్పారు. విన్కెంజో ఓ పథకం ప్రకారం సారాను హత్య చేశాడని వెల్లడించారు.