ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మరియుపోల్‌లో మారణహోమం - థియేటర్‌పై రష్యా బాంబు దాడి

ఉక్రెయిన్‌ దేశంలోని కీలక నగరాల్లో ఒకటైన మరియుపోల్‌‌లో రష్యా సేనను మారణహోమం సృష్టిస్తున్నాయి. దాదాపు 1200 మందికిపైగా ప్రజలు తలదాచుకునివున్న థియేటర్‌పై రష్యా సేనలు బాంబు దాడి చేశారు. దీంతో వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ దాడిలో థియేటర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, ప్రాణనష్టంపై మాత్రం ఇంకా ఓ స్పష్టత రాలేదు. రష్యా సేనలు ఉద్దేశ్యపూర్వకంగానే థియేటర్‌పై దాడికి పాల్పడినట్టు మరియుపోల్ అధికారులు వెల్లడించారు. 
 
మురియుపోల్ నగరాన్ని రష్యా సేనలు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. దీంతో ఈ నగరంలో దాదాపు 3 లక్షల మంది వరకు చిక్కుకున్నారు. ఒక ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్న రష్యా సైనికులు... ఆ ప్రాంతంలో ఇళ్లలో నివసిస్తున్న 400 మందిని బలవంతంగా తీసుకెళ్లి ఆస్పత్రిలో నిర్బంధించారు. 
 
ఇదిలావుంటే, ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సేనలు చెలరేగిపోతున్నాయి. వార్తలు సేకరణకు వెళ్లి ఫ్యాక్స్‌న్యూస్ జర్నలిస్టులు వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు పాత్రికేయులుల ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 12 అంతస్తుల భవనంపై కూడా రష్యా బలగాలు దాడి చేశాయి.