1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (15:31 IST)

న‌గ‌రంలో డ్రైవ్ ఇన్ థియేట‌ర్స్‌.. కారులో కూర్చునే..?

కరోనాకు ముందు ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. కానీ తర్వాత మార్పులు వచ్చాయి. సినిమా థియేటర్లను పక్కన ఓటీటీ ద్వారా సినిమాలు చూస్తున్నారు. 
 
కానీ ప్రస్తుతం ప్రజల సౌక‌ర్యార్థం న‌గ‌రంలో డ్రైవ్ ఇన్ థియేట‌ర్స్‌ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంది. కార్ల‌లోనే కూర్చొని సినిమా చూసే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంది.
 
దీనికోసం న‌గ‌రం మ‌ధ్య‌లో స్థలం దొర‌క‌డం క‌ష్టం కాబ‌ట్టి ఔట‌ర్ రింగ్‌రోడ్ ప్రాంతంలో స్థ‌లం కోసం అన్వేష‌ణ ప్రారంభించింది. డ్రైవ్ ఇన్ థియేట‌ర్స్ కోసం సుమారు రూ. 5 నుంచి రూ. 8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల్లో ఇలాంటి డ్రైవ్ ఇన్ థియేట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. 
 
ఇలాంటి థియేట‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తే ఎవ‌రి కార్లో కూర్చొని వారే సినిమాలు చూసే అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు.