1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (19:20 IST)

డీజే టిల్లు రిలీజ్ తేదీ ఖరారు.. ఫిబ్రవరి 12న వచ్చేస్తోంది..

DJ Tillu
డీజే టిల్లు సినిమా విడుదల తేదీని సినీ యూనిట్ ఖరారు చేసింది. సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా, టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాకు 'అట్లుంటది మనతోని'... అనేది ఉప శీర్షిక. సినిమాకు తమన్ నేపథ్య సంగీతం అందించారు. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ నటించిన ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్ సమర్పకులు. విమల్ కృష్ణతో కలిసి సిద్ధూ జొన్నలగడ్డ కథ రాశారు. 
 
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ సంస్థ... ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిసున్న చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇందులో నేహా శెట్టి కథానాయిక. ఇటీవల ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పారు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 
 
ఇటీవల రిలీజ్ చేసిన 'డీజే టిల్లు' ట్రైలర్ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. రామ్ మిరియాల సంగీతం అందించడంతో పాటు స్వయంగా పాడిన ఆ గీతానికి మంచి స్పందన లభించింది. అలాగే, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించిన 'రాజా రాజా... ఐటమ్ రాజా... రోజా రోజా... క్రేజీ రోజా...' పాటకూ మంచి స్పందన లభించింది.